సెప్టెంబరు 7న రక్త చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుంది...

ఠాగూర్
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (16:40 IST)
ఖగోళ అద్భుతాల కోసం ఎదురు చూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో అకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబరు 7-8  తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్‌ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఈ అద్భుత చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు వీక్షించే అవకాశం ఉంది. 
 
ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లోని ప్రజలు కూడా ఈ ఖగోళ వింతను చూసే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించి, ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణె, లక్నో, చంఢీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ఈ రక్త చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇటీవలికాలంలో ఇంత ఎక్కువసేపు, ఇంత విస్తృతంగా కనిపించే చంద్రగ్రహం ఇదే కావడం గమనార్హం. 
 
అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఎర్రగా కనిపిస్తుందనే సందేహాం చాలా మందికి కలుగుతుంది. సూర్యుడికి, చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినపుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడుతుంది. అయితే, సూర్యుని కాంతి భూమి వాతావరణం గుండా చెదిరిపోతుంది. కేవలం ఎరువు, నారింజ రంగుల కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడినే చేరతాయి. దీనివల్ల చంద్రుడు ప్రకాశవంతమైన ఎరువు రంగులో దర్శనమిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments