Webdunia - Bharat's app for daily news and videos

Install App

లూధియానాలో ఘోరం.. చాక్లెట్లు ఆశచూపి 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (11:11 IST)
దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పంజాబ్‌లోని లూధియానా నగరంలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. చాక్లెట్లు ఆశచూపి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థ నగర్‌కు చెందిన విశ్వకర్మ (25) అనే యువకుడు లూధియానాకు వలస వచ్చి కొంతకాలంగా సబ్జీమండి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. 
 
తన ఇంటికి పొరుగునే ఉన్న ఎనిమిదేళ్ల బాలికపై అతడి కన్నుపడింది. గురువారం బాలికకు చాకెట్లతోపాటు రూ.50 ఆశచూపి తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురును వెతుకుతూ తల్లి వెళ్లగా గదిలో నగ్నంగా ఉన్న యువకుడు ఆమెను నెట్టేసి పరారయ్యాడు. 
 
బాలికకు తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 342, 376 సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు లూధియానా ఏసీపీ గుర్బీందర్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం