Webdunia - Bharat's app for daily news and videos

Install App

42 ఏళ్లుగా విజయమెరుగని విక్రమార్కుడు!

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (13:23 IST)
ఎన్నికల నగారా మోగిందంటే... ఓటర్లు తమ ఓట్లను తనిఖీ చేసుకుంటుంటే... టిక్కెట్‌ల కోసం ఎదురుచూసే ఆశావహులు తమ పార్టీలలో ప్రయత్నించడం... కుదరకపోతే పార్టీ మారిపోవడం చూస్తూనే ఉంటాము. కానీ గత 42 ఏళ్లుగా లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతూనే ఉన్నా ఈసారి కూడా ఓడిపోతానని చెప్తూ కూడా పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థి గురించి మీకు తెలుసా...
 
వివరాలలోకి వెళ్తే... ఎన్నికల్లో పోటీ చేయడం అంటే అతనికి ఎంత ఇష్టం అంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నప్పటికీ... గత 42 ఏళ్లుగా పోటీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి 16 సార్లు ఘోరంగా పరాజయం పాలైనా మరోసారి కూడా లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. 
 
విశేషమేమిటంటే ఈసారి కూడా తాను ఓడిపోతానని ఆయనే చెబుతుండటం. ఆయన పేరు ఫక్కడ్‌ బాబా (75). ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతూంటారు. ఆయన 1977 ఎన్నికల్లో మధుర లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి  పోటీ చేసారు. 
 
అనంతరం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నోసార్లు బరిలోకి దిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తలపడ్డారు. తాజాగా 17వ సారి మధుర నుంచి మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. 
 
తాను 20వ సారి ఎన్నికల బరిలోకి దిగినప్పుడు తప్పక గెలుస్తానని తన గురువు నిశ్చలానంద స్వామి ఆశీర్వదించారని సదరు ఫక్కడ్ బాబాగారు చెప్తున్నారు. గో సంరక్షణే తన లక్ష్యమని, పేదల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందనీ పేర్కొంటున్న ఆయన ఎప్పటికి గెలుస్తారో చూద్దాం మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments