Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడ్రూమ్‌ని స్వర్గంగా మర్చేసే ఐకియా : ఐకియా వారి ‘కామసూత్ర’..

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (13:19 IST)
భారతదేశంలో అడుగిడినప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తున్న స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ దిగ్గజ సంస్థ ఐకియా ఇప్పుడు తాజాగా ప్రాచీన ‘కామసూత్ర’ గ్రంథానికి కొత్త రూపాన్ని ఇచ్చేసింది. సరికొత్త పొజిషన్స్ (భంగిమల)తో బెడ్‌రూమ్‌ను స్వర్గంగా మార్చుకోవడం ఎలాగో తెలుపుతూ అందమైన చిత్రాలతో 44 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చిన ఈ పుస్తకాన్ని చూస్తే మీకు కూడా కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. 
 
కామసూత్ర అనగానే.. మనమంతా వాత్సాయనుడు వ్రాసిన శృంగార గ్రంథమనే భావిస్తాం. అలాగే, పొజిషన్స్ అనగానే ఏవో భంగిమలే గుర్తుకు వస్తాయి. అయితే, ఓ ఫర్నీచర్ సంస్థ ప్రచురించిన ఈ కామసూత్ర పుస్తకంలో అటువంటి భంగిమలు ఉంటాయని భావిస్తే మాత్రం మీరంతా తప్పులో కాలేసినట్లే. ఔనండీ, ఇది పేరుకు మాత్రమే ‘కామసూత్ర’. బెడ్రూమ్‌ను స్వర్గంగా మలుచుకోవడం అంటే... సదరు ఫర్నిచర్ సంస్థ దృష్టిలో అందంగా తీర్చిదిద్దుకోండని మాత్రమే అర్థం. 
 
కాగా... కామసూత్రలో ఉండే ప్రతి భంగిమ పేరునీ ఐకియా ఈ పుస్తకంలో వాడేసుకుంది. ఉదాహరణకు డాగీ స్టైల్ అనే భంగిమ గురించి చెబుతూ బెడ్రూమ్‌ను పెంపుడు కుక్కలకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో సూచించింది. ఇలా మరికొన్ని భంగిమలను కూడా బెడ్రూమ్‌ల అలంకరణకు అన్వయిస్తూ ఈ ప్రయోగం చేసింది. దీంతో ‘కామసూత్ర’ అనగానే ఎంతో ఆశగా పుస్తకం చూసేవారు అవాక్కవుతున్నారు. 
 
ఐకియా చేసిన ఆసక్తికర ప్రయోగానికి చాలా వరకు మంచి స్పందనే వస్తున్నప్పటికీ... పాపం ఏదో ఆశించి ఈ పుస్తకాన్ని తెరిచినవారు మాత్రం నిరాశకు గురవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments