Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ప్రేయసీప్రియులు, హోటల్‌కెళ్లి ఎంజాయ్ చేసేందుకే...

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (15:37 IST)
మూడేళ్ల చిన్నారిని ప్రేయసీప్రియులు కిడ్నాప్ చేసారు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి కారణం విని పోలీసులు విస్తుపోయారు. తాము హోటల్ గదికి వెళ్లి ఎంజాయ్ చేసేందుకే ఆ బాలికను కిడ్నాప్ చేశామనీ, అక్కడ తాము ఆ చిన్నారికి అమ్మా-నాన్న అని చెబితే హోటల్ గది సుళువుగా దొరుకుతుందనీ, తమ ఎంజాయ్మెంట్‌కి ఢోకా వుండదన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేసినట్లు చెప్పారు.
 
పూర్తి వివరాలను చూస్తే... ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లోని ప్రాంతం నుంచి కిడ్నాప్ చేసిన మూడేళ్ల బాలికను పంజాబ్‌లోని జలంధర్ నుంచి రక్షించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ కేసులో చిన్నారి మేనత్త, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
 
చిన్నారి బాలిక అత్త నిషు ద్వివేది (20) మంగళవారం చిన్నారిని కిడ్నాప్ చేసి పంజాబ్‌లోని జలంధర్‌లో నివసిస్తున్న తన ప్రియుడి వద్దకు వెళ్లిందని ఫతేపూర్ పోలీస్ సూపరింటెండెంట్ సత్పాల్ ఆంటిల్ తెలిపారు. పోలీసు నిఘా బృందం శుక్రవారం జలంధర్‌కు చేరుకుని కిడ్నాప్ చేసిన బాలికను సురక్షితంగా రక్షించిందని తెలిపారు.
 
నిషు, ఆమె ప్రియుడు నవదీప్ సింగ్ అలియాస్ గిన్ని(25)ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. విచారణ సమయంలో, నిషూ తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి ఇంటి నుండి పారిపోయిందని, చిన్నారిని తనతో పాటు తీసుకువెళ్ళానని, తద్వారా తను, తన ప్రియుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భార్యాభర్తలుగా ఒక హోటల్‌లో ఉండవచ్చనన్న ఉద్దేశ్యంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. చిన్నారికి హాని కలిగించే ఉద్దేశ్యం తనకు లేదని ఆమె అన్నారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments