Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేస్తామని చెప్పినా... తుంగభద్ర కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

ఠాగూర్
శుక్రవారం, 11 జులై 2025 (15:47 IST)
కర్నాటకలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పెళ్ళి చేస్తామని హామీ ఇచ్చినా ఆ ప్రేమికులు మాత్రం నీటి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో హోసలింగాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ (18), సొనపుర గ్రామానికి చెందిన అంజలి (18) యేడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
వీరి ప్రేమను కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కలిసి జీవించడం సాధ్యం కాదని భావించిన వీరు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. దీంతో వారి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో పెళ్ళి చేస్తామని ఇరు కుటుంబాలు హామీ ఇవ్వడంతో ఆ జంట మునీరాబాద్‌కు తిరిగి వచ్చింది. 
 
పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ తమ కుటుంబాలు హాని తలపెట్టే అవకాశం ఉందని భావించిన ప్రేమికులు ఈ నెల 9వ తేదీన సాయంత్రం మునీరాబాద్ డ్యామ్‌పైకి చేరుకుని తుంగభద్ర ఎడమగట్టు కాలువలోకి దూకారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 
 
తుగంభద్రత కాలువలో వారి కోసం గాలించారు. స్థానిక జాలర్లు, కోస్తాతీర దళం, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువకు భారీగా వరద రావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments