ఈమధ్య కొంతమందికి రీల్చ్ పిచ్చి ముదిరిపోయింది. ఎక్కడ ప్రమాదం అంచు వుంటుందో అక్కడికి వెళ్లి రీల్స్ చేస్తున్నారు. కాస్త అటోఇటో అయితే ఇక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఫీట్ ను ఓ వ్యక్తి 300 అడుగులు ఎత్తు వున్న కొండపైన చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.
మహారాష్ట్ర లోని పఠాన్-సదావాఘాపూర్ మార్గంలో 300 అడుగుల ఎత్తు వున్న పర్యాటక కొండ వుంది. సాహిల్ అనిల్ జాదవ్ అనే వ్యక్తి కారుతో ఆ కొండపైకి వెళ్లాడు. అక్కడ కొండపైన స్నేహితులను దింపి వారు చూస్తుండగా కొండ అంచుకు వెళ్లి కారును రివర్స్ చేస్తూ విన్యాసాలు ప్రారంభించాడు. కొండపై నేల కాస్త చిత్తడిగా వుండటంతో కారు రివర్స్ చేస్తూ గిరికీలు కొడుతుండగా అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. దీనితో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడి చేష్టలను కొండపైన చూసిన పలువురు పర్యాటకులు... తిన్నది అరక్క ఇలాంటి వెధవ వేషాలు వేస్తుంటారని విమర్శనాస్త్రాలు సంధించారు. చూడండి వీడియో...