Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి వేళ తన గదికి రమ్మన్న ప్రియురాలు, తలుపు తీయగానే గోడ దూకేశాడు కానీ...

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (12:13 IST)
గాఢంగా ప్రేమించిన ప్రియురాలు నాలుగురోజులుగా జ్వరంతో బాధపడుతూ బయటకు రావడం మానేసింది. ప్రియురాలిని చూడలేకుండా బాధపడిపోతున్నాడు ప్రియుడు. అయితే ఫోన్లో నిన్ను చూడాలని ఉంది అని ప్రియురాలు అనగానే ఎగిరి గంతేసి అర్థరాత్రి అని చూడకుండా ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే వెళుతూ వెళుతూ శబ్ధాలు చేయడంతో ఆమె అన్నకు అనుమానం వచ్చి చెల్లెలి గదికి వచ్చాడు. ఇంకేముంది.
 
తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటై సమీపంలోని బాలానగర్‌లో నివాసముంటున్న సేతురామ్, కామాక్షిల దంపతుల కుమారుడు ఎల్లయ్య ఇంటర్ కంప్లీట్ చేసి ఒక బేకరిలో పనిచేస్తున్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా పనిచేసుకుంటూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నాడు.
 
అయితే అతని జీవితంలోకి ఒక యువతి ఎంటర్ అయ్యింది. ఆమె పేరు రాజేశ్వరి. ఎల్లయ్య ఉన్న ఇంటికి సమీపంలోనే ఆమె ఉంటోంది. ఆమె ప్రేమలో పడ్డాడు ఎల్లయ్య. ఆమె కూడా ఎల్లయ్యను ఒప్పుకుంది. ఇంకేముంది ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించారు.
 
కాలేజీ పేరుతో బయటకు రావడం మధ్యాహ్నం తరువాత డుమ్మా కొట్టడం.. ప్రియుడితో అలా తిరగడం మొదలెట్టారు. ఈ విషయం రాజేశ్వరి ఇంట్లో తెలియదు. అయితే గత వారంరోజుల క్రితం రాజేశ్వరికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె నాలుగురోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు.
 
ప్రియురాలికి జ్వరమన్న విషయం తెలిసి ఎల్లయ్య ఆవేదనకు గురయ్యాడు. ఎలాగైనా ఆమెను కలవాలనుకున్నాడు. అయితే నేరుగా ఇంటికి వెళితే రాజేశ్వరి ఇంటి వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయోనని కన్నీటిపర్యంతమయ్యాడు. అతడిని కూడా చూడాలనుకున్న ప్రియురాలు అర్థరాత్రి ఇంటికి రమ్మని చెప్పింది.
 
దీంతో రాజేశ్వరిని చూడొచ్చన్న ఆనందంతో అర్థరాత్రి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళుతున్న క్రమంలో ఎల్లయ్య టైం బ్యాడ్ పెద్దపెద్ద శబ్ధాలు రావడంతో రాజేశ్వరి అన్న ప్రభు పసిగట్టాడు. ఏదో జరుగుతోందనని చెల్లెలి గదికి వెళ్ళాడు. గట్టిగా తలుపులు కొట్టాడు. తలుపులు తీసి లోపలికి వెళ్ళిందే ఎల్లయ్య గోడ దూకుతూ కనిపించాడు.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభు మరుసటి రోజు ఉదయం నేరుగా ఎల్లయ్య ఇంటికి వెళ్ళాడు. అతనితో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. అతనిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయాడు ఎల్లయ్య. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే చనిపోయాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments