Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్‌పోర్టులపై 'కమలం' గుర్తు - ఎందుకు అలా చేశామంటే?

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (12:40 IST)
భారత ప్రభుత్వం జారీ చేసే పాస్ పోర్టులపై కమలం గుర్తును ముద్రిస్తున్నారు. ఈ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కావడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అదనపు భద్రతా చర్యల్లో భాగంగానే పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రిస్తున్నట్టు వివరణ ఇచ్చింది. 
 
కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రించిన విషయమై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళలోని కోళికోడ్‌లో ఈ పాస్‌పోర్టులను చేస్తున్నారని ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. ఎపుడూ లేనివిధంగా పాస్‌పోర్టులపై కమలం గుర్తు ఏంటంటూ ప్రశ్నించారు. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. 
 
ఈ క్రమంలో వీటిపై విదేశాంగ శాఖ స్పందించింది. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్.. కమలం అన్నది జాతీయ చిహ్నాల్లో ఒకటని.. అదనపు భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాతీయ చిహ్నాన్ని ముద్రించామని అన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే నెలలో మరో జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తామని రవీష్ కుమార్ స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments