Publish Date: Wed, 06 Nov 2019 (14:31 IST)
Updated Date: Wed, 06 Nov 2019 (17:47 IST)
కామాక్షీ దీపాన్ని వెలిగించేటప్పుడు దీపపు ప్రమిదకు, కామాక్షి రూపానికి పసుపు, కుంకుమ పెట్టి పుష్పములతో అలంకరించి, అక్షతలు సమర్పించి అమ్మవారికి నమస్కరించి పూజ చేయాలి. యజ్ఞయాగాది కార్యక్రమమములందు, ప్రతిష్టలలో, గృహప్రవేశాది కార్యక్రమాల్లో ఈ కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం శ్రేష్టం.
ఒకే వత్తితో కామాక్షి దీపాన్ని వెలిగించాలి. నువ్వుల నూనె, నేతితో దీపం వెలిగించవచ్చు. ఏ ఇంట్లో కామాక్షి దీపారాధన జరిగితే గజలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. రోజూ సాయం సంధ్య సమయంలో లక్ష్మీ తామర వత్తులను వాడి కామాక్షి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అలాగే 21 పున్నమి రోజులు అంటే 21 పౌర్ణమిలకు ఇంకా ఆ రోజున సూర్యోదయానికి ముందు కులదేవతా యంత్రాన్ని కామాక్షి దీపం కింద వుంచి ప్రాతఃకాలమున దీపం వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా గజలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
రోజూ ఉదయం, సాయంత్రం కామాక్షి దీపాన్ని పెడుతూనే.. పౌర్ణమి రోజున మాత్రం కులదేవతా యంత్రంపై కామాక్షి దీపాన్ని వుంచి నువ్వుల నూనె, తామర వత్తులను ఉపయోగించి పూజించడం ద్వారా సకల అభీష్టాలు, భోగభాగ్యాలు చేకూరుతాయి.