దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే నెల 13వ తేదీనే పోలింగ్ నిర్వహిస్తారు.
లోక్‌సభ ఎన్నికలు ఇలా...
తొలి దశ : ఏప్రిల్ 19వ తేదీన 102 లోక్‌సభ స్థానాలకు (21 రాష్ట్రాలు)
రెండో దశ : ఏప్రిల్ 26వ తేదీ, 89 ఎంపీ స్థానాలు (13 రాష్ట్రాలు)
మూడో దశ : మే 7వ తేదీ, 94 స్థానాలు (12 రాష్ట్రాలు)
నాలుగో దశ : మే 13వ తేదీ, 96 ఎంపీ స్థానాలు (10 రాష్ట్రాలు)