Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. లిక్కర్ కోసం క్యూలైన్లు.. రూ.52వేలకు మద్యం కొనేశాడు..

Webdunia
సోమవారం, 4 మే 2020 (23:48 IST)
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం లాక్ డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులిచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌లో అనేక స‌డ‌లింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా లిక్క‌ర్ షాపులు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ప‌లు రాష్ట్రాలు క‌రోనా కేసులు త‌క్కువ‌గా ఉన్న ఏరియాల్లో మ‌ద్యం సేల్స్‌కు అనుమ‌తి ఇచ్చాయి. 
 
దాదాపు 40 రోజుల త‌ర్వాత సోమ‌వారం షాపులు తెరుచుకోవ‌డంతో వంద‌లాది మంది ఒకేసారి లిక్క‌ర్ షాపుల‌కు క్యూలు క‌ట్టారు. దీంతో అనేక రాష్ట్రాల్లో భారీగా లిక్క‌ర్ సేల్స్ జ‌రిగాయి. క‌ర్ణాట‌క‌లో సోమ‌వారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.45 కోట్ల మేర మ‌ద్యం అమ్ముడైంద‌ని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్ల‌డించింది.
 
లాక్ డౌన్‌లో దాదాపుగా 40 రోజుల పాటు మ‌ద్యం దొరక్క‌పోయే సరికి నాలుక ఎండిపోయిన‌ట్ల‌యింది. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లలో మద్యంపై ఆంక్షలు సడలించడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 
 
అయితే ముందస్తు జాగ్రత్తలతో బెంగళూరుకు చెందిన పలువురు భారీ ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. మాస్క్ కొనుక్కోమంటే కొనుక్కుంటారో లేదో తెలియదు కానీ లిక్కర్ కొనుగోలుకు ఎగబడుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.52వేల లిక్కర్ కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన బిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments