కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (12:24 IST)
రోగులు ప్రాణాలను రక్షించాల్సిన అంబులెన్స్ డ్రైవర్లు కూడా కామాంధులై పోతున్నారు. ఆపదలో ఉన్న రోగులను ఆస్పత్రులకు చేర్చాల్సిన అంబులెన్స్ డ్రైవర్.. ఓ రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ రోగి సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్న యువతి కాదు. కరోనా వైరస్ సోకి ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కామాంధుడుకి కేరళ కోర్టు ఒకటి జైలుశిక్ష విధించింది. 
 
గత 2020 సెప్టెంబరు 5వ తేదీన జరిగిన ఈ అమానుష ఘటన వివరాలను పరిశీలిస్తే, కరోనా సోకిన 19 యేళ్ల యువతిని అంబులెన్స్‍‌లో తరలిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ ఆపాడు. కరోనా రోగి అనే కనికరం కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. తప్పు జరిగిపోయిందని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని నౌఫాల్ ప్రాధేయపడ్డాడు. అయితే, అదే రోజున కోవిడ్ సెంటరులో‌ని అధికారులకు బాధితురాలు తనపై జరిగిన అత్యాచారంపై సమాచారం అందించింది. ఈ విషయాన్ని కోవిడ్ సెంటర్ అధికారులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, వారు నిమిషాల వ్యవధిలోనే నిందితుడుని అరెస్టు చేశారు. ఆ తర్వాత నౌఫాల్‌పై అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
కాగా, నౌఫాల్ గతంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసును విచారించిన పట్టణమిట్ట ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు శనివారం సాయంత్రం సంచలన తీర్పును వెలువరించింది. నౌఫాల్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ.1.08 లక్షల అపరాధం కూడా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments