Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

Exam
ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (11:19 IST)
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ పరీక్షల్లో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి ముగ్గురు విద్యార్థులు దొరికిపోయిన ఘటన మరువకముందే, శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్-1) పరీక్షల్లో మరో ఇద్దరు విద్యార్థులు పట్టుబడటం గమనార్హం. 
 
బుధవారం జరిగిన ఘటనతో యూనివర్శిటీ స్పెషల్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. స్క్వాడ్ తనిఖీలో స్లిప్పులతో ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. విద్యార్థుల జవాబు పత్రాలు, గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ల స్వాధీనం చేసుకున్నారు. జవాబు పత్రాలను మాల్‌ప్రాక్టీస్ కమిటీకి అధికారులు పంపించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం 160 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments