జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లోని సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకున్నాడు. దీంతో అతన్ని తీసుకుని ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు.
కాగా, అగ్నిప్రమాదంలో తన కుమారుడు గాయపడ్డాడని తెలియగానే పవన్ కళ్యాణ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన సింగపూర్‌కు బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడి ఆస్పత్రిలో చికిత్స తర్వాత మార్క్ శంకర్ కోలుకోవడంతో అతడితో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చారు.
తన కుమారుడు మార్క్ శంకర్‌ను ఎత్తుకుని విమానాశ్రయం నుంచి పవన్ బయటకు వస్తున్న దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ వెంట ఆయన భార్య, కుమార్తె, జనసేన పార్టీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌లు ఉన్నారు.