Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

Advertiesment
Renu Desai

ఠాగూర్

, శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (20:34 IST)
నెటిజన్లతో పాటు మీడియాపై సినీ నటి రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా ఆమె పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన రెండో వివాహం గురించి మాట్లాడారు. అయితే, సమాజంలో అనేక అంశాలు వుంటే వాటన్నింటిని పక్కబెట్టి తన రెండో పెళ్లి వార్తనే హైలెట్ చేస్తూ వార్తలు రాయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. 
 
"మీడియా వాళ్లు నా రెండో వివాహం విషయమై ఎంతో ఆసక్తిగా ఉన్నారని నాకర్థమవుతోంది. ఇటీవల నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్‌‍కాస్ట్‌లో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటన్నింటి కంటే శ్రోతలు నాత రెండో వివాహంపైనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరోమారు నిరూపితమైంది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే దయ చేసి ఈ 44 యేళ్ల మహిళ వివాహం విషయం నుంచి మీ దృష్టిని మరల్చండి అంటూ వ్యాఖ్యానించారు. 
 
పాడ్‌కాస్ట్‌లో నేను మాట్లాడిన పన్ను ఆంక్షలు, మహిళ భద్రత, ఆర్థిక వద్ధి, వాతావరణ మార్పులు తదితర విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. అలా చేస్తే మనం మంచి పౌరులుగా, అంతకుమించి గొప్ప మనుషులుగా అవుతాం. నా పెళ్ళి గురించి ఇప్పటికే వందలసార్లు మాట్లాడాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా స్నేహితులను ప్రభావితం చేసే విషయం. దయచేసి ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా స్నేహితులను ప్రభావితం చేసే విషయం. దయచేసి మీ చదువు, విజ్ఞానం, జర్నలిజంలో మీకున్న అనుభవాన్ని ఒక మహిళ రెండో వివాహం కోసం ఉపయోగించుకోండి. ఇదేమీ సమాజాన్ని, చట్టాలను ప్రభావితం చేసే విషయం కాదు కదా అనే రేణూ దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష