Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

Advertiesment
pooja hegde

ఠాగూర్

, ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (12:28 IST)
ఓ జర్నలిస్టుపై హీరోయిన్ పూజా హెగ్డే మండిపడ్డారు. ఆమె నటించిన స్టార్ హీరోల గురించి పదేపదే ప్రశ్నలు సంధించాడు. ఇది పూజాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో జర్నలిస్టుపై ఆమె మండిపడ్డారు. అసలు నీ సమస్య ఏమిటి అంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీన్ని గమనించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు.
 
పూజా హెగ్డే ప్రధాన పాత్రలో దేవా అనే పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా పూజాహెగ్డే, నటుడు షాహిద్‌ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో నటించడంపై పూజాహెగ్డేకు ప్రశ్నలు ఎదురుకాగా.. ఆమె ఆగ్రహానికి గురయ్యారు.
 
'మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్‌ హీరోల చిత్రాలైతేనే చేస్తారా?' అని విలేకరి ప్రశ్నించాడు. స్టార్‌ హీరోల గురించి వరుస ప్రశ్నలు వేయడంపై పూజాహెగ్డే ఆగ్రహానికి గురయ్యారు. 'అసలు మీ సమస్య ఏంటి?' అని ప్రశ్నించారు. 
 
దీంతో అక్కడ వాతావరణం కాస్త హీటెక్కింది. దీన్ని గమనించిన షాహిద్‌ కపూర్‌ వెంటనే సరదాగా మాట్లాడారు. 'నువ్వు యాక్ట్‌ చేసిన స్టార్‌ హీరోలంటే అతడికి ఇష్టం అనుకుంటా. అతడు కూడా ఆ హీరోల పక్కన యాక్ట్‌ చేయాలనుకుంటున్నారు. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారు' అని జోకులు వేశారు.
 
అంతకుముందు '‘బాలీవుడ్‌ అగ్ర హీరోలైన సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించడాన్ని అదృష్టంగా భావిస్తారా? ఆయా చిత్రాలకు మీరు అర్హులేనని అనుకుంటున్నారా?’’ అని విలేకరి ప్రశ్నించాడు. 
 
"ఆయా చిత్రాలకు నేను అర్హురాలినే. తమ చిత్రాల్లోకి నన్ను ఎంపిక చేసుకోవడంపై దర్శక నిర్మాతలకు కొన్ని కారణాలు ఉంటాయి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సన్నద్ధమై పూర్తి స్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేయాలి. అలా చేస్తే అదృష్టం వరించినట్లే అనుకుంటా. నా జీవితంలో అదే జరిగింది. ఒకవేళ మీరు అదృష్టం వల్లే నాకు ఈ అవకాశాలు వచ్చాయనుకుంటే.. నేను ఏమాత్రం బాధపడను. అలాగే అనుకోండి’’ అని కాస్త అసహనం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)