2025 హీరోయిన్ పూజా హెగ్డేకు బాగా కలిసొచ్చేలా వుంది. ఈ ఏడాది పూజా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే రెట్రో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది కాకుండా హిందీలో ఆమె నటించిన దేవా సినిమా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవా గర్ల్ ఫ్రెండ్ దియాగా పూజా కనిపించింది.
ఈ సినిమాలో పూజా.. షాహిద్‌కు ఘాటు లిప్ కిస్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మొదటిసారి పూజా హెగ్డే ఇంత ఘాటుగా లిప్ కిస్ సీన్స్ చేయడం. దీంతో అమ్మడు ఈ లిప్ కిస్ వలన మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.
అలాగే ఇంకా తాను ప్రేమలో పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాకిచ్చింది పూజా హెగ్డే. తీరా చూశాక పూజా హెగ్డే తాను సినిమా అవకాశాల కోసం ఒక సినిమా ముగిసిన వెంటనే మరో చిత్రం కోసం ఎదురుచూసేదాన్ని అని.. ఇలా చేయడం ద్వారా తాను సినిమాల ప్రేమలో పడ్డానని అనిపిస్తుందని చెప్పింది. దీంతో తాను ఓ హీరో ప్రేమలో పడ్డానని వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది బుట్టబొమ్మ. తాను హీరోతో ప్రేమలో పడలేదని.. సినిమాలపైనే ప్రేమతో వున్నానని క్లారిటీ ఇచ్చింది.