Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రౌడీయిజం చేయనని ప్రతిజ్ఞ చేసిన పాత్రలో సూర్య44 రెట్రో

Suriya-Retro

డీవీ

, గురువారం, 26 డిశెంబరు 2024 (09:33 IST)
Suriya-Retro
వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ #Suriya44, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాకి 'రెట్రో' అనే టైటిల్‌ను చేస్తూ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన ఎక్సయిటింగ్ టీజర్ ద్వారా టైటిల్ ని రివిల్ చేశారు. సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు.
 
టైటిల్ టీజర్ రెట్రో వరల్డ్ కి గ్లింప్స్ ని ప్రజెంట్ చేస్తోంది, ఇది ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్ , ఎమోషనల్ డెప్త్‌ను బ్లెండ్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. టీజర్ సూర్య పాత్రపై కేంద్రీకృతమై ఉంది, పూజా హెగ్డే పాత్రపై అతని ప్రేమ, హింసాత్మక ప్రపంచం నుండి బయటికి వెళ్ళడానికి అతని సంఘర్షణని ప్రజెంట్ చేస్తోంది.
 
కాశీ ఘాట్‌లపై కూర్చున్న సూర్య, పూజల మధ్య పీస్ ఫుల్ మూమెంట్ లో టీజర్ ప్రారంభమైంది. ఒక పవర్ ఫుల్ సన్నివేశంలో, సూర్య తన హింసాత్మక గతాన్ని విడిచిపెడతానని హామీ ఇస్తాడు, రౌడీయిజం ప్రపంచంలో భాగం కానని ప్రతిజ్ఞ చేస్తాడు. పూజ హెగ్డే కి ప్రపోజ్ చేసినప్పుడు ఈ సున్నితమైన క్షణం రొమాంటిక్ మలుపు తీసుకుంటుంది, ఆమె ఆనందంగా అంగీకరిస్తుంది.
 
టీజర్ లో సూర్య పాత్ర తాలూక గత సంఘర్షణ కీలకంగా వుంది. సూర్యని అతని తండ్రి  ప్రపంచంలోని ఇతర ప్రమాదకరమైన వ్యక్తులతో ముడిపడి ఉన్న వైలెంట్ లెగసీ వెంటాడుతుంది. టీజర్ అతని ఫెరోషియస్ గ్యాంగ్‌స్టర్ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపుతుంది. టీజర్ ఫైనల్ మూమెంట్స్ లో సూర్య అసలైన ఇంటెన్స్ వెర్షన్ ని ప్రజెంట్ చేస్తోంది.
 
టీజర్ సూచించినట్లుగా, ఈ చిత్రం కమర్షియల్ అప్పీల్‌ను గ్రిప్పింగ్ కథనం వుంటుంది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ విజువల్ గ్రాండియర్‌తో మెరుస్తుంది, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్,  యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్ ని ఎలివేట్ చేసింది. మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్.
 
ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌) సహా నిర్మాతలు.
 నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యే సినీ ప్రముఖులు ఎవరంటే..?