Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

Game Changer -Ramcharan

డీవీ

, బుధవారం, 18 డిశెంబరు 2024 (08:29 IST)
Game Changer -Ramcharan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమానే “గేమ్ ఛేంజర్”. సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ వేడుక అమెరికాలో జరగనుంది. కానీ ఈ సినిమా గురించి ఇంతవరకు పెద్దగా ప్రచారం చేయలేదని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తున్నారు.

ఇంతకుముందు శంకర్ సినిమాలు ప్లాప్ లు కావడంతో ఈ సినిమా కూడా అంతేనేమో అనేంతగా బయట చర్చ జరుగుతోంది. కానీ శంకర్ తన సినిమాల్లో ఏదో ఒక సామాజిక అంశం, సామాన్యుడి కోణంలో ప్రశ్నిస్తుంటాడు.
 
అలాగే గేమ్ ఛేంజర్ లో పొలిటీషియన్ పై ఓ అస్త్రం ఎక్కుపెట్టాడు. అది హైలైట్ అవుతుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే అందులో నటించిన శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇందులో ఎవ్వరూ ఊహించని ఇంతకుముందు రాని అంశం వుంటుందనీ, పొలిటికల్ అంశమే అయినా ఏ పార్టీనిగానీ, వ్యక్తిగతంగాగానీ వేలుచూపేట్లుగా వుండదు. ఎవరికీ వర్తించదు. కానీ పాయింట్ మాత్రం మేథావులను, సామాన్యులను ఆలోచింపజేస్తుందని అది పార్లమెంట్ ను కూడా ప్రశ్నించేలా వుంటుందనీ తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్  రెండు పాత్రలు చేశారు.  అందులో ఒకటి ముసలి పాత్ర కాగా, రెండోది రామ్ చరణ్ యంగ్ లో వుండగా ఆయనకు తోడుగా వుంటే పాత్ర. ఆ తోడు ఏవిధంగా వుంటుందనేది కూడా సస్పెన్స్ అంటూ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల