Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జాగ్రత్తలు తీసుకుందాం- కరోనా దరి చేరకుండా జాగ్రత్తపడదాం

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (07:42 IST)
దేశ వ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కోవిడ్ రెండో దశ కూడా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు అన్ లాక్ పేరుతో ఇప్పటికే అనేక సడలింపులు ఇవ్వడం జరిగింది.

నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు కూడా ప్రారంభం అవుతున్నాయి. పండుగల సీజన్ కూడా ఇప్పటికే మొదలైంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ ముప్పు తప్పిందన్న భావనలో ప్రజలు ఉండకుండా బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి.

వ్యాక్సిన్ కూడా ఈ ఏడాది వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టేనిని స్పష్టత వచ్చిన నేపథ్యంలో మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కింద ఇవ్వబడిన జాగ్రత్తలను పాటించండి.
 
* ఇతరులతో భౌతిక దూరం తప్పక పాటించాలి. ఎదుటి వ్యక్తికి కనీసం ఆరడుగులు లేదా రెండు గజాల దూరంలో ఉండండి. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎవరైనా బయట కలిసినా దూరం నుంచే పలకరించుకోండి.
 
* బయటకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి. సర్జికల్ మాస్కులు  ధరించినట్టయితే ఒకసారి వాడిన తర్వాత వాటిని తిరిగి ఉపయోగించవద్దు. ఇంట్లో తయారు చేసుకుని తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉన్న కాటన్ మాస్కులను ఉపయోగించడం మంచిది.  
 
* మీ కళ్లు, ముక్కు, నోటిని అనవసరంగా తాకకండి. ఎందుకంటే వాటి ద్వారానే కోవిడ్ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒకవేళ తాకినట్టయితే వెంటనే చేతులను సబ్బుతో కానీ, శానిటైజర్ తోగానీ శుభ్రం చేసుకోండి.  
 
* శ్వాసకోశ పరిశుభ్రతలను తప్పకకుండా పాటించండి. తుమ్ము, దగ్గు వచ్చినపుడు మీ మోచేతిని అడ్డుపెట్టుకోండి. లేదా హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించండి. తుమ్మినపుడు చేతులను అడ్డుపెడితే వెంటనే శుభ్రం చేసుకోండి.
 
* మీ చేతులను తరచుగా ఆల్కాహాల్ శానిటైజర్ తోగానీ, సబ్బు నీటితో గానీ కనీసం 20 నుంచి 40 సెకన్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత, ఇతరులు ఇచ్చిన వస్తువులను తాకినపుడు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. 
 
* పొగాకు, ఖైనీ, గుట్కా వంటి వాటిని తినవద్దు. బహిరంగంగా ఉమ్మివేయవద్దు. 
 
* తరచుగా తాకే వస్తువులు ప్రదేశాలు క్రమం తప్పకుండా క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోండి.
 
* అనవసరమైన ప్రయాణాలు మానుకోండి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. 
 
* ఒకేచోట ఎక్కువ మంది గుమికూడే ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు వెళ్లకండి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. 
 
* కోవిడ్ సంబంధిత సమాచారం కోసం  ఆరోగ్యసేతు , రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలు, కోవిడ్ టెస్టులు, ఆస్పత్రుల వివరాల కోసం మరియు కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోండి.  
 
* కోవిడ్ బారినపడిన వారిపై గాని, వారికి సంరక్షకులుగా ఉన్న వారిపై గానీ వివక్ష చూపవద్దు. వీలైతే వారికి అవసరమైన సాయం చేయడానికి ప్రయత్నించండి. 
 
* కోవిడ్ పై ఖచ్చితమైన సమాచారం కోసం ప్రభుత్వం నియమించిన అధికారులు, స్థానిక ఆరోగ్య కార్యకర్తలను మాత్రమే సంప్రదించండి. 
 
* ఒకవేళ జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే 104 నంబర్ కు ఫోన్ చేయండి
 
* మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురైతే అవసరమైన సలహా లేదా సాయం కోసం ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 104 కి కాల్ చేయండి. వైఎస్ఆర్ టెలీమెడిసిన్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ తో మాట్లాడి ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు.

కోవిడ్-19 కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం 8297104104 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయొచ్చు లేదా 8297104104 నెంబర్ కు డయల్ చేసి ఐవిఆర్ఎస్ ద్వారా సమాచారం పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments