Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను అస్సలు లెక్కచేయలేదు.. కుంభమేళాలో లక్షలాది మంది..

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (10:00 IST)
Kumbh Mela
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో లక్షలాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తి ప్రపత్తులతో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని 14వ తేదీన ప్రారంభమైన కుంభమేళా.. ఏప్రిల్ 27వ తేదీ వరకు కొనసాగుతుంది.
 
చైత్రమాసం పౌర్ణమితో ముగుస్తుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి, సోమావతి అమావాస్య, బైసాఖీ, శ్రీరామ నవమి, చైత్ర పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.
 
ఈ నాలుగు నెలల వ్యవధిలో కనీసం ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. అదెలా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 
Kumbh Mela
 
కోవిడ్ మార్గదర్శకాలను పాటించడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ.. దాన్ని ఎవరూ పాటించట్లేదనేది సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న వీడియోలను బట్టి చూస్తే తెలిసిపోతోంది. ఈ వీడియోలపై నెటిజన్ల నుంచి వివిధాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments