Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లర అడిగితే బస్సు నుంచి దించేశాడు.. 12కి.మీ నడిచిన విద్యార్థిని

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:10 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఏర్పడింది. ప్రభుత్వ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సంఘటన జరిగిన రోజు తన ఇంటికి చేరుకోవడానికి నేదురుమంగడు డిపోలో ప్రభుత్వ బస్సు ఎక్కింది. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుండగా విద్యార్థిని కండెక్టర్‌కు వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంది. 
 
విద్యార్థికి టికెట్‌ ఇచ్చిన కండక్టర్‌ చిల్లర ఇవ్వలేదు. తర్వాత ఇస్తానని చెప్పాడు. రెండు మూడుసార్లు అడిగినా కండక్టర్ విద్యార్థినికి చిల్లర ఇవ్వలేదు. ఆ విద్యార్థిని పదే పదే అడగడంతో ఆవేశానికి గురైన కండక్టర్ విద్యార్థిని దూషించి అవమానించాడు. అంతేగాకుండా విద్యార్థినిని బలవంతంగా బస్సు నుండి దించాడు. విద్యార్థిని వద్ద వేరే డబ్బు లేకపోవడంతో మరో బస్సులో ఇంటికి వెళ్లలేకపోయింది. 
 
కన్నీళ్లతో సంఘటనా స్థలం నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం విద్యార్థిని తండ్రి సంబంధిత బస్ డిపోకు వెళ్లి కండక్టర్‌ను నిలదీశాడు. దీంతో కండక్టర్ విద్యార్థిని తండ్రిని అనుచిత పదజాలంతో దూషించాడు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు ట్రాఫిక్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments