Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ కోటలో మరో ఇద్దరు విద్యార్థుల మృతి

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (14:44 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పరీక్ష రాసిన కొద్దిసేపటికే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో రెండు నెలల పాటు కోటలో కోచింగ్ ఎగ్జామ్స్‌ను బ్యాన్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలావుంటే, ఈ యేడాది ఇప్పటివరకు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 24కు చేరింది.
 
మృతులను మహారాష్ట్రకు చెందిన 18 యేళ్ళ ఆవిష్కార్ సంభాజీ కాస్లే, బీహార్ రాష్ట్రానికి చెందిన ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు కోచింగ్ ఇనిస్టిట్యూట్‌‍ ఆరో అంతస్తు నుంచి ఆవిష్కార్ దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. నీట్ కోసం మూడేళ్ళ నుంచి కోటాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆదర్శ్ రాజ్ కూడా తాను ఉంటున్న ఫ్లాట్‌లో రాత్రి 7 గంటలకు ఉరేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఈ పనికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
 
ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీచేశారు. కోటాలో రెండు నెలల పాటు ఎలాంటి కోచింగ్ ఎగ్జామ్స్ నిర్వహించరాదని ఆదేశించారు. కోటాలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మనోధైర్యం చెప్పాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, కోటాలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments