Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (12:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. బాధితురాలు చదువుతున్న సౌత్ కోల్‌కతా లా కాలేజీకి చెందిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది. 
 
వివరాల్లోకి వెళితే... సౌత్ కోల్‌ఖతా లా కాలేజీలో తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై ఇటీవల కాలేజీ ప్రాంగణంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు అధికార టీఎంసీకి చెందిన స్థానిక నేతగా గుర్తించారు.
 
తాజాగా ఈ కేసులో సెక్యూరిటీ గార్డు పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. విద్యార్థులకు రక్షణగా ఉండగాల్సిన గార్డే ఈ దారుణంలో పాలుపంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కళాశాల ఆవరణలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. అందులో రాజకీయ నాయకుడుతో పాటు కాలేజీ సిబ్బంది ప్రమేయం కూడా ఉండటంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో నగరంలో మరోమారు మహిళల భద్రపై చర్చ మొదలైంది. కేసులో ఇంకెంతమంది పాత్ర ఉందనే కోరణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం