Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో మరో కీచకుడు.. లైంగికదాడిని అడ్డుకుందనీ నాలుక కొరికి ఉడాయించాడు

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన మరువకముందే శుక్రవారం మరో దారుణం చోటుచేసుకుంది. కేజీహళ్లిలో విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (05:39 IST)
బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన మరువకముందే శుక్రవారం మరో దారుణం చోటుచేసుకుంది. కేజీహళ్లిలో విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికి అక్కడి నుంచి ఉడాయించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో బస్‌స్టాప్‌కు వెళ్తుండగా దుండగుడు అడ్డుకోగా యువతి ప్రతిఘటించింది. ఇంతలో స్థానికులు రావడంతో దుండగుడు ఉడాయించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
అలాగే, దారుణాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటన ఒకటి జరిగింది. తాజాగా గ్యాంగ్ రేప్‌కు సహకరించలేదన్న కోపంతో ఓ బాలిక చెవులును దుండగులు కోసేశారు. అడ్డు వచ్చిన ఆమె తల్లిపైనా దాడి చేశారు. భాగ్‌పట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా వారు ఆమెను అవమానించారు. దుండగులు కోసేసిన చెవులను చూపించినా వారు కేసు నమోదు చేసేందుకు వెనకాడారు. చివరికి మీడియా జోక్యం చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం