Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు రికమెండేషన్ - ఖుష్భూకు ఆ పార్టీలో ఆ పదవి...

తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. ప

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (18:05 IST)
తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. పండుగ రోజే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో తమిళనాడులో ప్రజల్లో చరిష్మా ఉన్న నేత ఉంటే బాగుంటుందన్నది కాంగ్రెస్ అధినేతల ఆలోచన. అందుకే ఖుష్భూను ఎంచుకున్నారు.
 
అందులోను మెగాస్టార్ చిరంజీవి ఖుష్భూకు రెకమెండేషన్ చేయడంతో అధిష్టానం కాదనలేకపోయింది. చిరు, ఖుష్భూలిద్దరు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరికి మంచి పరిచయం ఉంది. రాజకీయాల్లో మాత్రం ఇద్దరు మొదట్లో వేర్వేరుగా ఉన్నా ఆ తరువాత సినిమా ఫంక్షన్లలో మాత్రం పరిచయం కొనసాగుతూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు ఖుష్భూ రాజకీయంగా నిలబడేందుకు దోహదం చేస్తోంది. తమిళనాడులో ఇప్పటికే సినీనటులు రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఖుష్బూను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతోంది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments