కేరళ అటవీ శాఖలో ఒక మహిళా అటవీ అధికారి ఆశ్చర్యకరమైన పని చేశారు. ఆ మహిళ కేవలం 6 నిమిషాల్లో దాదాపు 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారంతా పామును పట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్యోగులందరూ అవాక్కయ్యారు. బల్లులు, బొద్దింకలకు భయపడే మహిళలు ఆమె నుండి నేర్చుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ జిఎస్ రోషిణి కేరళ అటవీ శాఖలో తన ఎనిమిది సంవత్సరాల కెరీర్‌లో 800 కి పైగా విషపూరితమైన, విషం లేని పాములను పట్టుకుని రక్షించారు.
ఈ ఘటన జిల్లాలోని కట్టకడ రెసిడెన్షియల్ ప్రాంతంలో జరిగింది. రోషిణి నిమిషాల్లోనే కింగ్ కోబ్రాను పట్టుకొని సంచిలో బంధించింది. రోషిణి చూపిన ధైర్యసాహసాలను స్థానికులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.