Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ అయినా వదలరా? నర్సుపై హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ అత్యాచారం..

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:33 IST)
దేశంలో కరోనా వైరస్‌తో ప్రజలు నానా తంటాలు పడుతున్న వేళ.. కామాంధులు మాత్రం మారట్లేదు. కేరళలోని తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. హోం క్వారంటైన్‌ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించడంతో కేరళలో సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళ మలప్పురంలో 44 ఏళ్ల మహిళ హోం నర్సుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె విధులు ముగించుకుని తన ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ ఆమెను క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.
 
ఈ నేపథ్యంలో ఆమె యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గానే తేలింది. ఆ పరీక్షల ధ్రువీకరణపత్రాల్ని తన ఇంటికి వచ్చి తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి ఆమెకు సూచించాడు. దీంతో సెప్టెంబర్‌ 3న ఆమె అతడి ఇంటికి వెళ్లగా సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, తర్వాతి రోజు వదిలిపెట్టినట్లు మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments