Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ నోటి నుంచి ఒక్క మాట రాలేదు..

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:03 IST)
భాజపా కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ, చాలా కాలానికి తన గళం వినిపించారు.. ఈ మేరకు ఆయన తన బ్లాగ్‌లో... 'మొదట దేశం.. తర్వాత పార్టీ... ఆ తర్వాతే వ్యక్తిగతం' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పలు ప్రకంపనలు కలుగజేస్తున్నాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ తన ప్రత్యర్థులుగా చూసిందే తప్ప.. శత్రువులుగానో, దేశద్రోహులుగానో చూడలేదని ఆయన వ్యాఖ్యానించడంపై... జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు.
 
కురువృద్ధుడు అద్వానీ భాజపా అధికారంలో ఉండిన ఈ ఐదేళ్ల కాలంలో మాట్లాడి ఉంటే ఎంతో బాగుండేదని పేర్కొన్న ఆవిడ...  బీజేపీ మూలపురుషుడైన అద్వానీ తన పార్టీ ప్రస్తుత వైఖరిని ప్రశ్నిస్తుండడాన్ని తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని కూడా తెలిపారు. 
 
మోడీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదనీ... దేశభక్తి పేరుతో విపక్ష నేతలందరినీ దేశ వ్యతిరేకులుగా ముద్ర వేసేందుకు ప్రస్తుత భాజపా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు.
 
2014 నుండి ఒక్క మాట కూడా మాట్లాడని అద్వానీ... కేంద్రంలో భాజపా అధికారం ముగియబోతున్న ఈ చివరి క్షణాల్లో మాట్లాడారని అన్నారు. మొత్తం మీద అద్వానీకి ఇప్పటికి భావ ప్రకటనా స్వేచ్ఛ వచ్చినట్లుంది కదా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments