Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ హీరోతో డేటింగ్‌లో ఉన్నానా? ఎవరు చెప్పారు?

Advertiesment
బాలీవుడ్ హీరోతో డేటింగ్‌లో ఉన్నానా? ఎవరు చెప్పారు?
, శనివారం, 30 మార్చి 2019 (12:07 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కియారా అద్వానీ. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం "వినయ విధేయ రామ". ఈ చిత్రంలో కూడా కియారా అందాలను ఆరబోసింది. 
 
అయితే, ఈమె అటు టాలీవుడ్‌లో రాణిస్తూనే.. అటు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెపై పలురకాలైన పుకార్లు వచ్చాయి. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కియారా... బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
వీటిపై కియారా స్పందించింది. ఈ తరహా వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. పైగా, తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. పైగా, తాను చేయాల్సిన చిత్రాలతో బిజీగా ఉన్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిజ్రాగా విజయ్ సేతుపతి.. వందకు వంద మార్కులు..