Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌‍కౌంటర్ చేస్తే రూ.1,11,11,111 రివార్డుగా ఇస్తాం...

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (10:56 IST)
ప్రముఖ గ్యాంగ్‌‍స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసే పోలీస్ అధికారికి రూ.1,11,11,111 (రూ.1.11 కోట్లు) నగదు బహుమతిగా ఇస్తామని క్షత్రిక కర్ణిసేన ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ అమరవీరుడు బాబా సిద్ధిఖీ హత్యకు లారెన్స్ బిష్ణోయ్‌ ప్రధాన కారణమని ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి జైలులో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్... జైలు నుంచే బెదిరింపులకు పాల్పడుతున్నారని, అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. 
 
గత 2023 డిసెంబరు 5వ తేదీన అప్పటి కర్ణిసేన చీప్ అయిన సుఖ్‌దేవ్ సింగ్‌ను దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే హత్యకు తామే కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సరిహద్దుల వద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం సబర్మతి జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్ నివాసం ఎదుట కాల్పులు జరిపింది కూడా బిష్ణోయ్ ముఠా సభ్యులే కావడం గమనార్హం. అలాగే, ముంబైలో ఇటీవల జరిగిన మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని కూడా ఈ ముఠా సభ్యులో కాల్చి చంపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments