Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షవాతంతో కదల్లేని స్థితిలో భర్త.. భార్య శవం పక్కనే వారం రోజులు

కర్ణాటక రాష్ట్రంలో హృదయం ద్రవించుకుని పోయే సంఘటన ఒకటి జరిగింది. గుండెపోటుతో భార్య చనిపోయింది. ఆమె శవం పక్కనే పక్షవాతంతో బాధపడుతూ కదల్లేనిస్థితిలో భర్త. అలా ఒకటికాదు.. రెండు కాదు... ఏకంగా వారం రోజుల పా

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:01 IST)
కర్ణాటక రాష్ట్రంలో హృదయం ద్రవించుకుని పోయే సంఘటన ఒకటి జరిగింది. గుండెపోటుతో భార్య చనిపోయింది. ఆమె శవం పక్కనే పక్షవాతంతో బాధపడుతూ కదల్లేనిస్థితిలో భర్త. అలా ఒకటికాదు.. రెండు కాదు... ఏకంగా వారం రోజుల పాటు ఉన్నాడు. చివరకి మృతురాలి సోదరుడు అక్కడకు వచ్చి చూసి హతాశుడయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కర్ణాటకలోని కర్వాడ్‌లోని కేహెచ్‌బీ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ (60), గిరిజ (55) దంపతులకు సంతానం లేదు. గిరిజ ఇతరుల ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అదేసమయంలో భర్తకుపక్షవాతం సోకడంతో కాలుచేయి పడిపోయింది. దీంతో ఆయన కదల్లేని స్థితిలో కుర్చీకే పరిమితమయ్యాడు. 
 
ఈ క్రమంలో వారం రోజుల క్రితం గిరిజ గుండెపోటుతో మృతిచెందింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆనంద్ కదల్లేని పరిస్థితిలో ఏడు రోజులుగా భార్య మృతదేహం పక్కనే ఉన్నాడు. వారంరోజులుగా అతనికి ఆహారం లేకపోవడంతో చిక్కిశల్యమైపోయాడు. 
 
ఇంతలో గిరిజ సోదరుడు ఆమెకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, ఎవరూ రిసీవ్ చేసుకోలేదు. దీంతో అతనికి అనుమానం వచ్చి, గిరిజ ఇంటికి వచ్చి చూడగా హతాశుడయ్యాడు. తలుపులు కొట్టినప్పటికీ తీయకపోవడంతో పైకప్పునుంచి లోనికి తొంగిచూసి అవాక్కయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఆనంద్‌ను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments