Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య చనిపోతే.. శవంతో ఏడు రోజులు గడిపాడు.. చివరికి కొన ఊపిరితో..

భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన

భార్య చనిపోతే.. శవంతో ఏడు రోజులు గడిపాడు.. చివరికి కొన ఊపిరితో..
, సోమవారం, 16 జులై 2018 (14:28 IST)
భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు గడిపాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలోని కారవారలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్‌ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్‌ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. 
 
ఇంటి పనులు చేస్తూ బతికే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడడంతో ఆదివారం గిరిజ ఇంటికి వచ్చారు. అయితే అక్కడికొచ్చాకే తెలిసింది. గిరిజ ప్రాణాలు కోల్పోయిందని. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్‌ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమారస్వామి కంటతడి-బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ ఓదార్పు.. ఎలా?