Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఠాగూర్
మంగళవారం, 8 జులై 2025 (16:39 IST)
crime scene
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మూఢనమ్మకం పరాకాష్టకు చేరింది. దెయ్యం పట్టిందన్న అనుమానంతో తల్లిని కన్నకొడుకు కట్టించి చంపేశాడు. భూతవైద్యం పేరుతో మహిళపై గంటల తరబడి కర్రలతో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 55 యేళ్ళ తల్లి గీతమ్మ ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాలను పరిశీలిస్తే, గీతమ్మ (55) ప్రవర్తనలో మార్పులు రావడంతో ఆమె దెయ్యం పట్టిందని ఆమె కొడుకు సంజయ్ బలంగా నమ్మాడు. ఈ క్రమంలో భూతవైద్యం చేస్తానని చెప్పిన ఆశ అనే మహిళను ఆమె భర్త సంతోశ్‌ను సంప్రదించాడు. 
 
సోమవారం రాత్రి గీతమ్మ ఇంటికి వచ్చిన ఆశ, సంతోశ్ దెయ్యం వదిలించే పూజలు మొదలుపెట్టారు. ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో అర్థ స్పృహలో ఉన్న గీతమ్మ తలపై నిమ్మకాయతో కొట్టడం, జట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టడం వంటి దృశ్యాలు ఉన్నాయి. 
 
రాత్రి 9.30 గంటలకు మొదలైన ఈ దాడి తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగింది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో గీతమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, గీతమ్మ కొడుకు సంజయ్‌తో పాటు భూతవైద్యం పేరుతో దాడికిపాల్పడిన ఆశ, ఆమె భర్త సంతోశ్‌ను అరెస్టు చేశారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Pawan: హరి హర వీరమల్లు అసలు కథ ఇదేనంటే క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments