Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ.. ఎందుకు?

తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ విద్యార్థుల కళ్ళ ఎదుటే మంటల్లో కాలిపోయింది. దీనికి కారణం.. ఓ వ్యక్తి తరగతి గదిలోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బెంగళూరు మహానగర శివారు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:03 IST)
తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ విద్యార్థుల కళ్ళ ఎదుటే మంటల్లో కాలిపోయింది. దీనికి కారణం.. ఓ వ్యక్తి తరగతి గదిలోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బెంగళూరు మహానగర శివారు మాగడి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కర్ణాటకలో పెను కలకలం రేపుతోంది. 
 
దీనిపై బ్యాదరహల్లి పోలీసులు వెల్లడించిన వివరాలన మేరకు.. సునంద (50) అనే మహిళా ఉపాధ్యాయురాలు బుధవారం మధ్యాహ్నం తరగతి గదిలోని విద్యార్థులకు పాఠం చెబుతుండగా రేణుకారాధ్య అనే వ్యక్తి తరగతి గదిలోకి చొరబడి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది వేగంగా స్పందించి, మంటలు ఆర్పేసి, హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చారు. 
 
ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న సుకందకట్టె ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాట్లాడుతూ... ఆమెకు 50 శాతం గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments