చెన్నై మహానగరంలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యమయ్యాడు. సాయంత్రం వేళ కాస్త సేదతీరేందుకు సముద్రతీరానికి వెళ్లిన ఆ టెక్కీ అదృశ్యమయ్యాడు.
చెన్నై మహానగరంలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యమయ్యాడు. సాయంత్రం వేళ కాస్త సేదతీరేందుకు సముద్రతీరానికి వెళ్లిన ఆ టెక్కీ అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
నెల్లూరు జిల్లా కావలికి చెందిన కంచర్ల వెంకట సాయితేజ (24) అనే యువకుడు చెన్నైలోని టెక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 13వ తేదీన తన గదిలో పర్స్, ఫోను పెట్టి బైక్‌పై బీచ్‌కు వెళ్లిన అతడు మళ్లీ తిరిగి గదికి రాలేదు. స్నేహితులు అతడి కోసం తీవ్రంగా గాలించగా బీచ్‌లో బైక్ కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, సాయి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.
సాయి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చెన్నై చేరుకుని గాలించినా ఫలితం లేకపోవడంతో వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి కోసం గాలిస్తున్నారు. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.