Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిలో వాటా అడిగిన ప్రియురాలిని చంపి పాతేసిన ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 16 జులై 2020 (17:24 IST)
ఆస్తిలో వాటా అడిగడాన్ని జీర్ణించుకోలేని ఓ ప్రియుడు.. తన ప్రియురాలని చంపేసి... పాతిపెట్టేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా హగరి బొమ్మనహళ్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హగరిబొమ్మనహళ్లి తాలూకా గిరిగూండనహల్లి గ్రామనికి చెందిన హులిగమ్మ (42) అనే మహిళకు అదే జిల్లాలోని హొస్పేట్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. 
 
అయితే కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సిద్ధలింగప్పతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం గత 15 యేళ్లుగా వారి మధ్య కొనసాగుతోంది. 
 
ఈ విషయం గ్రామస్థులందరికీ తెలుసు. పైగా, గత 15 యేళ్లుగా హులిగమ్మ కుటుంబాన్ని సిద్ధలింగప్ప పోషిస్తూ వస్తున్నాడు. అయితే అతనికి ఆస్తులు ఉండటంతో... ఆస్తిలో వాటాను ఇవ్వాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తోంది.
 
నెలనెలా ఎంతో కొంత ఇస్తున్నప్పుడు ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వాలంటూ ఆమెను నిలదీశాడు. ఈ విషయం పెద్దదై ప్రతిరోజు వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఆమె అడ్డును తొలగించుకోవాలని అతను ప్లాన్ వేశాడు. 
 
తన పొలానికి  తీసుకెళ్లి ఆమెను చంపేసి, తన పొలంలోనే పాతిపెట్టి వెళ్లిపోయాడు. గత రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు విచారణలో భాగంగా, హులిగమ్మకు అక్రమ సంబంధం ఉందనే విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే సిద్ధలింగప్పను అదుపులోకి తీసుకుని విచారించగా అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లి హులిగమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు. 

సంబంధిత వార్తలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments