Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ.. లో దుస్తులు కొనుక్కోవాలి.. షాపులు తెరవండి..

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (16:28 IST)
కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో ముందుగా మే 10 నుంచి 24వ తేదీ వరకు రెండు వారాలు లాక్ డౌన్ ప్రకటించినా కేసుల ఉద్ధృతితో దానిని పొడిగించారు. దీంతో ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. 
 
జూన్ 7 తర్వాత కూడా కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఓ వ్యక్తి సీఎం యెడియూరప్పకు ఓ లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. తన లోదుస్తులు పూర్తిగా పాడయ్యాయని.. వాటిని కొనుక్కునేందుకు షాపులు తెరిపించాలని ఆ లేఖలో రాశాడు. చామరాజపురానికి చెందిన నరసింహమూర్తి ఈ లేఖలో తన బాధను రాసుకొచ్చాడు.
 
మీకు నా వినతి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ నాకున్న జత బనియన్లు, అండర్ వేర్లు పూర్తిగా చిల్లులు పడ్డాయి. గత రెండు వారాల నుండి కొత్తవి కొనుక్కోవాలని అనుకున్నా లాక్ డౌన్ నేపథ్యంలో షాపులు తెరవడం లేదు. 
 
ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుంది. అలా కొనసాగించే పక్షంలో వారానికి ఒకసారైనా షాపులు కొద్ది గంటలపాటు తీసినా నాలాంటి వారికి ఇన్ని ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఈ లేఖలో పేర్కొన్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments