Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని బెదిరించి ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు

కర్నాటక రాష్ట్రంలో ఓ కామాంధ ప్రధానోపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థినిపై ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన దారుణం ఒకటి తాజాగా వెలుగుచూసింది. అదీ కూడా ఆ విద్యార్థినిని బెదిరించి తనవశం చేసుకుని కా

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (14:16 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ కామాంధ ప్రధానోపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థినిపై ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన దారుణం ఒకటి తాజాగా వెలుగుచూసింది. అదీ కూడా ఆ విద్యార్థినిని బెదిరించి తనవశం చేసుకుని కామవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళెయం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలో దుగ్గప్ప అనే కామాంధుడు ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినిని దుగ్గప్ప బెదిరించి లొంగదీసుకుని.. గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ విషయం బయటకు చెప్పకూడదని విద్యార్థినిని బెదిరించాడు. 
 
ఈ నేపథ్యంలో మైనర్ బాలిక సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన కడుపుకొప్పికి గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్ళగా అసలు విషయం బయటపడింది. 
 
తనను బెదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం చేస్తోన్న విషయాన్ని ఆ బాలిక బయటపెట్టింది. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు పోలీసులు ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్పను అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments