Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెబిట్‌ కార్డులు - రైల్ ఆన్‌లైన్ టిక్కెట్లపై సేవా రుసుం రద్దు: ఆర్థిక శాఖ

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇందులోభాగంగా, డెబిట్ కార్డులు వినియోగంతో పాటు.. ఆన్‌లైన్‌లో రైల్ టిక్కెట్ల

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (13:02 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇందులోభాగంగా, డెబిట్ కార్డులు వినియోగంతో పాటు.. ఆన్‌లైన్‌లో రైల్ టిక్కెట్ల కొనుగోలుపై సేవా రుసుం (సర్వీస్ ట్యాక్స్)ను రద్దు చేసింది. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. డెబిట్‌ కార్డుల వినియోగంపై రుసుములు పూర్తి ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ బుకింగ్‌కు డిసెంబర్‌ 31 వరకు సేవా రుసుము రద్దు చేసిందని.. ట్రాయ్‌ యూఎస్‌ఎస్‌డీ ఛార్జీలను రూ.1.50 నుంచి 50పైసలకు తగ్గించిందని తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా 65 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నందున.. డిజిటల్‌ లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, ఈ-వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్‌బీఐ రూ.20 వేలకు పెంచినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా 1.5 లక్షల తపాలా కార్యాలయాలు నగదు సరఫరా చేస్తున్నట్లు శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఇకపోతే.. సహకార బ్యాంకులకు నాబార్డు రూ.21 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments