Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంచివున్న ఒమిక్రాన్ ముప్పు : రాత్రిపూట కర్ఫ్యూ విధించిన కర్నాటక

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:24 IST)
ఒమిక్రాన్ వైరస్ ముప్పు పొంచివుండటంతో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. మరోవైపు, కొత్త సంవత్సర వేడుకలు సమీపించాయి. దీంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో స్థానికల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో కర్నాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. ఈ నెల 28వ తేదీ నుంచి పది రోజుల పాటు కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుధాకర్ వెల్లడించారు. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతోందని, ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా, కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments