Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కరోనా విజృంభణ : థియేటర్లకు ఆంక్షలు

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (12:29 IST)
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, సినిమా హాళ్లలో సీటింగ్‌ సామర్థ్యాన్ని 50 శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 7న నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. 
 
సినిమాళ్లలో సీటింగ్‌ సామర్థ్యం 50 శాతం తగ్గిస్తామని గత శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. సీటింగ్‌ సామర్థ్యాన్ని కుదించొద్దని కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి, కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి సీఎం యడ్యూరప్పకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. అయినా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి సగం సీటింగ్‌ కేపాజిటీతో నడపాలని ఆదేశించింది.
 
అయితే, ఓ వైపు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా శనివారం రాత్రి బెంగళూరులోని వీరేశ్‌ థియేటర్‌లో జనం గుమిగూడి కనిపించడం ఆందోళన కలిగించింది. గత శుక్రవారం ప్రభుత్వం కొత్త కొవిడ్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
పలు జిల్లాల పరిధిలో పబ్బులు, రెస్టారెంట్లలో 50శాతానికి మించి వినియోగదారులు మించొద్దని ఆదేశించడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. ఇదిలా ఉండగా.. శనివారం కర్ణాటకలో 4373 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా, 19 మంది మృతి చెందారు. ఇందులో మూడువేలకుపైగా కేసులు బెంగళూరు అర్బన్‌ ప్రాంతం నుంచే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments