Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి చొరబడిన చిరుత.. బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లింది...

Webdunia
ఆదివారం, 10 మే 2020 (09:59 IST)
కరోనా వైరస్ పుణ్యమాని అనేక పశుపక్ష్యాదులతో పాటు... క్రూరమృగాలు, వన్యప్రాణాలకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు అయింది. దేశ వ్యాప్తంగా వాహన రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో అనేక ప్రాంతాల్లో వన్య ప్రాణులు, చిరుతలు, పులులు, ఏనుగులు, జింకలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అయితే, పలు ప్రాంతాల్లో కొన్ని క్రూరమృగాలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. దీంతో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 
 
తాజాగా కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది అటవీ ప్రాంతం నుంచి జనసంచారంలోకి వచ్చిన ఓ చిరుత నేరుగా ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మూడేళ్ల బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లి తినేసింది. 
 
జిల్లాలోని మాగడి తాలూకా కదరయ్యనపాళ్యానికి చెందిన కుటుంబం వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయింది. వీరు మంచి నిద్రలో ఉండగా అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన చిరుత వారి మూడేళ్ల కుమారుడు హేమంత్‌ను నోట కరుచుకుని పట్టుకెళ్లింది.
 
ఉదయం లేచి చూసే సరికి కుమారుడు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు మంగళగౌరమ్మ, చంద్రప్ప దంపతులు గ్రామస్థులతో కలిసి సమీపంలో గాలించారు. ఇంటికి 60 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం కనిపించినట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments