Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాదిలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఖజానాకు కాసుల వర్షం

Advertiesment
Liquor Sales
, గురువారం, 7 మే 2020 (21:50 IST)
కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపులు పుణ్యమాని పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఈ మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ఖజానాలు కాసుల వర్షంతో నిండిపోతోంది. 
 
ఈ నాలుగు రాష్ట్రాల్లో మందుబాబుల కోలాహలం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిలబడి మద్యం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్న మందుబాబులే కనిపిస్తున్నారు. కాగా, మద్యం అమ్మకాలు ప్రారంభమై మూడు రోజులు కాగా, గురువారం ఒక్కరోజే కర్ణాటక భారీస్థాయిలో ఆదాయం రాబట్టింది.
 
కర్ణాటక మొత్తమ్మీద రూ.165 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తొలి రెండు రోజుల్లోనే కర్ణాటకలో రూ.242 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయంటే మందుబాబుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం విక్రయాలు ప్రారంభమైన రోజే కర్ణాటకలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. బెంగళూరులోని కొన్ని వైన్ షాపుల వద్ద యువతులు కూడా క్యూలైన్లలో దర్శనమిచ్చారు.
 
ఇకపోతే, తమిళనాడు రాష్ట్రంలో గురువారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో మద్యం బాబులు మండుటెండలోనూ మద్యం కోసం వరుస క్రమంలో నిల్చొన్నారు. ముఖ్యంగా, కడలూరు జిల్లాలోని ఓ మద్యం దుకాణం ఎదుట మద్యం బాబులు ఏకంగా మూడు కిలోమీటర్ల మేరకు వరుస క్రమంలో నిల్చున్నారు. ఈ ఒక్క రోజే ఏకంగా చెన్నై మినహా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రూ.140 నుంచి రూ.165 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగినట్టు సమాచారం.
 
అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 శాతం, తెలంగాణాలో 10 నుంచి 75 శాతం మేరకు మద్యం ధరలు పెంచినప్పటికీ... మందుబాబులు మాత్రం మద్యం కోసం ఎగబడుతున్నారు. ఫలితంగా రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మరో ఆరు నెలలు ఉండొచ్చు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి