Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూర్‌లో విచిత్రం : ఎస్పీ ఎమ్మెల్యే గన్‌మెన్‌ ఖాతాలో రూ.100 కోట్లు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో విచిత్రం జరిగింది. గన్‌మెన్‌గా పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. తన బ్యాంకు ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటాన్ని చూసిన ఆ గన

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (05:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో విచిత్రం జరిగింది. గన్‌మెన్‌గా పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. తన బ్యాంకు ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటాన్ని చూసిన ఆ గన్‌మెన్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. దేశంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం అనేక విచిత్రాలు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. అనేకమంది ఖాతాల్లో వారికి తెలియకుండానే కోట్ల రూపాయలు చేరుతున్నాయి. కొద్దిసేపట్లో మాయం కావడాన్ని చూస్తున్నాం. ఇలాంటి సంఘటనే ఇది కూడా. 
 
కాన్పూర్‌లో గన్‌మెన్‌గా పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్‌ గులాం జిలానీ బ్యాంకు ఖాతాలో ఏకంగా వంద కోట్లు జమకావడం సంచలనం సృష్టించింది. యూపీ అధికార పార్టీ ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకీ వద్ద ఆయన గన్‌మెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత రాత్రి ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బు డ్రా చేసిన అనంతరం ఏకంగా రూ.99,99,02,724 బ్యాలన్స్‌గా ఉన్నట్టు ఫోన్‌కు సందేశం వచ్చింది. 
 
దీంతో నిర్ఘాంతపోయిన జిలానీ వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే దీన్ని కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో బ్యాంకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆ ఖాతాను స్తంభింపచేశారు. ఇంత మొత్తం అతని ఖాతాలోకి ఎలావచ్చింది అన్న అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని ఒక ప్రాంతంలో చిన్న అద్దె ఇంట్లో నివాసముండే జిలానీ ఖాతాలో కోట్లాది డబ్బులున్నట్టు వార్తలు రావడంతో అతని కుటుంబసభ్యులు విస్మయం వ్యక్తంచేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments