Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజల కోసం కాలేయం కావాలన్న దంపతులు.. బాలికను చంపేసి...

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (12:22 IST)
దేశానికి గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు మారుతున్నప్పటికీ.. ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ప్రతి రోజూ హత్యలు, అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా క్షుద్రపూజల కోసం ఓ బాలికను చంపేసి కాలేయాన్ని తీసుకెళ్లారు. వళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటనను పరిశీలిస్తే,
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని కాన్పూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన పరశురామ్‌కు 1999లో పెళ్లి జరిగింది. ఈయనకు ఇప్పటివరకు పిల్లలు లేరు. దీంతో క్షుద్రపూజలు చేస్తే పిల్లలు పుడతారని అతడు భావించాడు. అంతే.. ఓ పూజారి చెప్పిన మాటలు విని బాలిక కాలేయం కోసం అదే గ్రామానికి చెందిన ఆంకుల్, బీరాన్‌లను సంప్రదించారు. ఇందుకోసం ఇద్దరు వ్యక్తులకు రూ.1,000 ఇచ్చారు. 
 
ఈ డబ్బు తీసుకున్న ఆంకుల్, బీరాన్‌లు అదే గ్రామానికి చెందిన ఓ బాలికను చంపేసి కాలేయంతో పాటు.. శరీరంలోని ఇతర అవయవాలను కూడా తీసుకెళ్లారు. అందులో కాలేయం మాత్రం ఆ దంపతులకు ఇచ్చారు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఆ బాలిక మృతదేహం లభ్యమయ్యాక, ఆమె ఇంటి పక్కనే ఉండే ఆంకుల్, బీరాన్‌లపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా తామే ఈ ఘాతుకానికి కారకులమని అంగీకరించారు. 
 
బాలిక కాలేయాన్ని క్షుద్రపూజల కోసం తీసుకురమ్మని పరశురామ్ అనే వ్యక్తి తమకు డబ్బు ఇచ్చాడని వారిద్దరు చెప్పారు. దీంతో ఆమెను చంపిన ఆ ఇద్దరు నిందితులతో పాటు పరశురామ్, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపి, అన్ని విషయాలను రాబట్టడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments