మోడీ ప్యాంట్లు వేసుకోకముందు నుంచే ఇండియన్ ఆర్మీ వుంది : కమల్ నాథ్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:06 IST)
భారత ఆర్మీ విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే విమర్శించడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిస్టర్ మోడీ.. మీరు ప్యాంట్లు, పైజామాలు వేసుకోకముందు నుంచే ఇండియన్ ఆర్మీ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలోనే భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం పటిష్టంగా రూపుదిద్దుకున్నాయని గుర్తుచేశారు. పైగా, తనను భ్రష్ట్ నాథ్(అవినీతికి అధిపతి)అని మోడీ పిలవడంపై కూడా కమల్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
దేశంలో ఇప్పటివరకూ నరేంద్ర మోడీ హయాంలోనే అత్యధిక ఉగ్రదాడులు జరిగాయన్నారు. 2001లో ఎవరి హయాంలో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా భారత్ తమ హయాంలోనే సురక్షితంగా ఉందంటూ మోడీ డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments