Webdunia - Bharat's app for daily news and videos

Install App

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (19:59 IST)
తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందంటూ తమిళ అగ్రనటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కర్నాటక భాషాభిమానులు, కర్నాటక భాషా సంఘాలు, రాజకీయ నేతలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయన నటించిన థగ్ లైఫ్‌తో పాటు ఆయన సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిషేధిస్తామని కర్నాటక రాష్ట్ర సాంస్కృతి శాఖామంత్రి శివరాజ్ తంగడగి హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కమల్ హాసన్ కన్నడిగుల గురించి అనుచితంగా మాట్లాడారు. ఇది కన్నడిగులు సహించరు. ఆయన క్షమాపణలు చెప్పాలి. లేదంటే కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాస్తాను. ఈ రోజే చెబుతున్నాను. ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇందులో మరో మాటకు తావులేదు. లేదంటే ఆయన సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా చూస్తాం అని తంగడగి స్పష్టం చేశారు. 
 
మరోవైపు, కమల్ హాసన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్నాటకలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాషకు వేల సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఆగ్రహంతో కొన్ని చోట్ల కమల్ హాసన్ పోస్టర్లను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమల్ హాసన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన నటించిన థగ్ లైఫ్ చిత్ర ప్రదర్శనను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments