Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షాతో కేఏ పాల్ భేటీ: అప్పుల కుప్పలుగా మారిన తెలుగు రాష్ట్రాలు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (11:33 IST)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమిత్ షాతో పలు విషయాలపై చర్చించినట్టు చెప్పారు. ఇటీవల తనపై జరిగిన దాడి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందన్నారు.
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రూ. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రూ. 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందమి తెలిపారు. అప్పులు ఇలాగే చేసుకుంటూ పోతే త్వరలోనే దేశం మరో శ్రీలంక అవడం ఖాయమని హెచ్చరించారు. 
 
తెలంగాణలో డీజీపీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదని, కానీ అమిత్ షా అడగ్గానే ఇచ్చారని అన్నారు. ప్రధాని మోదీని కలవాలని షా సూచించారన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments